తదుపరి వార్తా కథనం

Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగతజీవిగా కనిపించిన యువకుడు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 18, 2023
10:49 am
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్టేడియంలోని కె బ్లాక్ లో ఒక యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మృతుడు నగరంలోని ఐకానిక్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ గణేష్ చంద్ర బారిక్ కుమారుడు ధనంజయ్ బారిక్ (21)గా గుర్తించారు.ధనంజయ్ ఒడిశా నివాసి.
ఈరోజు ఉదయం 8గంటల సమయంలో మృతదేహం లభ్యమైంది.మైదాన్ పోలీస్‌స్టేషన్‌లోని బృందం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు.
ఇవాళే పోస్టుమార్టం నిర్వహించనున్నారు.ఈఘటనపై మైదాన్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు కాగా,నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఈవిషయంపై మరింత సమాచారం కోసం అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు కోల్‌కతా పోలీసువర్గాలు మీడియాకి తెలిపాయి.