Page Loader
Guinness Record : పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు
పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు

Guinness Record : పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2023
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే చాలు ఎలాంటి పని అయినా సులభంగా చేయగలం. పేక ముక్కలతో ఓ చిన్న నమూనా కట్టడానికే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది ఓ బాలుడు పేక ముక్కలతో ఓ భారీ నిర్మాణాన్ని చేపట్టి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. ప్లేయింగ్ కార్డులతో నాలుగు ఎత్తెన నిర్మాణాలు చేపట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఓ బాలుడు చోటు సంపాదించుకున్నాడు. కోల్‌కతాకు చెందిన 15 ఏళ్ల అర్నర్ 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్ ను ఉపయోగించి, కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, ఎస్‌టీ పాల్ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు.

Details

బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన ఆర్నవ్

ఆ భవనాలన్నింటీని కేవలం 41 రోజుల్లోనే పూర్తి చేశాడు. ముఖ్యంగా ఎలాంటి టేపు సాయం లేకుండా ఆ నాలుగు భవనాలను నిర్మించడం విశేషం. మొత్తం ఈ ప్రాజెక్టు పొడవు 40 అడుగులు, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు, వెడల్పు 16 అడుగుల 8 అంగుళాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లెయింగ్ కార్డ్స్ నిర్మాణంగా చరిత్రకెక్కింది. ఆర్నవ్ గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టినట్లు వరల్డ్ రికార్డ్స్ తాజాగా ప్రకటించింది. ఓవైపు చదువుకుంటూ, ఇలా పేక ముక్కలతో బిల్డింగ్‌లు కట్టడం చాలా కష్టమైందని, అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ హాబీని సీరియస్‌గా తీసుకున్నానని ఆర్నవ్ తెలిపాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్లేయింగ్ కార్డ్స్‌తో అద్భుతమైన నిర్మాణం