
ముంబై: చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. హడలెత్తిన కస్టమర్.. పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై బంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కలకలం రేపింది. అప్రమత్తమైన కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనురాగ్ సింగ్ తన స్నేహితుడితో కలిసి డిన్నర్ చేసేందుకు బాంద్రా వెస్ట్‌లోని పాలి నాకా వద్ద ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లాడు.
అతను రోటీతో పాటు చికెన్, మటన్ థాలీని ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తుండగా అందులో నుంచి భిన్నమైన మాంసం ముక్క కనిపించింది. నిశితంగా పరిశీలించగా అది ఎలుక మాంసం ముక్క అని తేలింది.
అనురాగ్ వెంటనే దాబా మేనేజర్‌ని అతను నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అనురాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చికెన్ కర్రీలో కనిపిస్తున్న ఎలుక
Man finds baby #rat in dish served at Bandra’s Papa Pancho Da Dhaba restaurant in #Mumbai. pic.twitter.com/gEdj0tQthe
— Madhuri Adnal (@madhuriadnal) August 16, 2023