Page Loader
Bomb Threat to Schools : ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Bomb Threat to Schools : ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 08, 2024
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలోని కొన్ని పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. నగరంలోని సుమారు 5 పాఠశాలలకు గురువారం బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు ప్రజలు భయాందోళన చెందవద్దని, ఈమెయిల్స్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలక ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని కనుగొనడానికి ఆపరేషన్ ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాఠశాలలకు బాంబు బెదిరింపులు