LOADING...
Hyderabad:హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

Hyderabad:హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ శివారులోని జీడిమెట్లలో ఆరోరా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌లో కెమికల్స్ మిక్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సూరారం ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ అనే కార్మికుడు మరణించగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు రహస్యంగా తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కంపెనీ దగ్గరకు చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులకు సంబంధిత సమాచారం అందించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు 

గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదం 

గత ఏడాది మార్చి 1న కూడా ఆరోరా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో రవీందర్ రెడ్డి (25), కుమార్ (24) అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తరచు జరుగుతున్న ప్రమాదాల కారణంగా స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ రెండు ఘటనలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వివరాలు 

జాగ్రత్త చర్యలు అవసరం 

తరచూ జరుగుతున్న ప్రమాదాలు పరిశ్రమలో భద్రతాపరమైన లోపాలను సూచిస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.