Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయిలు తేల్చుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ బోర్డు మరోసారి ఓటీఎస్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 01 నుంచి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా, వినియోగదారులు బకాయిలను చెల్లిస్తే వడ్డీ, ఫైన్లు మాఫీ కానున్నాయి. అధికారికంగా వెచ్చించిన నిబంధనల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
నియమాలు ఇవే
ఈ పథకం కేవలం అక్టోబర్ 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. యాక్టివ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. - గతంలో ఓటీఎస్ పథకాన్ని ఉపయోగించని వారు బకాయిలను ఒకేసారి చెల్లిస్తే, అన్ని వడ్డీలు, ఆలస్య రుసుములు పూర్తిగా మాఫీ అవుతాయి. - గతంలో ఓటీఎస్ ఉపయోగించిన వారు 50% వరకు వడ్డీ మాఫీ పొందగలరు. - పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు భవిష్యత్తులో 24 నెలల పాటు క్రమంగా బిల్లులు చెల్లిస్తామని ఆఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది.
వడ్డీ మాఫీ విధానం
మేనేజర్ స్థాయిలో ఉన్న అధికారులకు రూ. 2,000 వరకు వడ్డీ మాఫీ చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ రూ. 2,001 నుంచి రూ. 10,000 వరకు వడ్డీ మాఫీ చేయవచ్చు. - జనరల్ మేనేజర్ స్థాయిలో రూ. 10,001 నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీ మాఫీ సాధ్యమవుతుంది. - చీఫ్ జనరల్ మేనేజర్ రూ. 1,00,001 పైగా వడ్డీ మాఫీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.