
ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న మరో గూడ్స్ రైలు సోమవారం మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.
గూడ్స్ రైలు డుంగూరి నుంచి బార్‌గఢ్‌కు సున్నపురాయితో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన రైలు భారతీయ రైల్వే వ్యవస్థతో అనుసంధానించబడలేదు.
ఈ గూడ్స్ రైలు డుంగ్రి సున్నపురాయిని ఓ ప్రైవేటు సిమెంట్ ప్లాంట్‌కు చేరవేస్తుంది. ఈ విషయంలో రైల్వే పాత్ర ఏమీ లేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటనలో తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన దృశ్యాలు
#WATCH | Some wagons of a goods train operated by a private cement factory derailed inside the factory premises near Mendhapali of Bargarh district in Odisha. There is no role of Railways in this matter: East Coast Railway pic.twitter.com/x6pJ3H9DRC
— ANI (@ANI) June 5, 2023