Tamil Nadu : తమిళనాడులో మర్డర్.. కత్తితో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపాడు. మహ్మద్ ఆషిక్ అనే వ్యక్తి ధర్మపురిలోని ఎలక్కియాంపట్ ప్రాంతంలోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అతని నలుగురు వ్యక్తులు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి చంపారు. ఘటనాస్థలంలోని సీపీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయ్యింది. మొదటగా నిందితులు హోటల్లోకి ప్రవేశించారు. వారిలో ఇద్దరు ఆషిక్తో మాట్లాడటానికి ప్రయత్నించగా, నిందితులలో ఒకరు కత్తి తీసి బాధితుడిపై దాడి చేశారు.
నిందితుల్లో ఒకరు అరెస్టు
ఆషిక్ దాడిని తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హోటల్ సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా నిందితులు వారిని కూడా బెదిరించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆశిక్ను ధర్మపురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకొనే లోపే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేశారు. ఆషిక్ ఒక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండడం వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
వ్యక్తిని చంపుతున్న దృశ్యాలు
Hotel employee hacked to death in Tamil Nadu's Dharmapuri. The deceased was identified as 25-year-old Muhammad Ashik. One person arrested, police looking out for more suspects.#TamilNadu pic.twitter.com/GFV0B7tH62— Vani Mehrotra (@vani_mehrotra) July 28, 2024