Page Loader
HYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన
రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన

HYD: రాజీవ్ పార్క్ పేరుతో భారీ ఎకో పార్క్.. గచ్చిబౌలిలో మంత్రుల ప్రతిపాదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనను సమర్పించారు. ఈ అంశంపై సమావేశమైన మంత్రులు, అక్కడ దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఎకో పార్క్‌లో బర్డ్ పార్క్, బట్టర్‌ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడి సరస్సులు, రాళ్ల ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల భూమితోపాటు, హెచ్‌సీయూలో ఉన్న మరో 1600 ఎకరాలను సమీకరించాలని సూచించారు. మొత్తం 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్క్‌ను నిర్మించాలన్న ఈ ప్రతిపాదనలో, దీనికి 'రాజీవ్ పార్క్' అనే పేరును ఇవ్వాలని సిఫార్సు చేశారు.

Details

భూముల వివాదంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతల భేటీ

ఇక మరోవైపు, హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ పార్టీ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ క్రమంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్‌కి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ కమిటీ సభ్యులతో ఆమె సమావేశం కానున్నారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ భూ వివాదానికి పరిష్కార మార్గం ఏమిటన్న దానిపై నిర్ణయం వచ్చే కొన్ని రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశముంది.