భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు
ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు సనాఖాన్ భర్త సాహుని అరెస్ట్ చేసారు. సనాఖాన్‌ను తాను చంపినట్లు పోలీసుల ముంగిట సాహు ఒప్పుకున్నారు. వ్యక్తిగత విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాల్లో గొడవల కారణంగా సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు సాహు తెలియజేసాడని పోలీసులు వివరించారు. కొన్నిరోజుల క్రితం సాహుని కలవడానికి జబల్ పూర్ కు సనాఖాన్ వెళ్ళింది. జబల్ పూర్ చేరుకున్న తర్వాత తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత రోజు నుండి ఆమె కనిపించకుండా పోయింది.
శవాన్ని నదిలో పారేసిన భర్త
సనాఖాన్ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సనాఖాన్ భర్తపై అనుమానం ఉందని తల్లిదండ్రులు తెలియజేయడంతో అతన్ని విచారించారు. విచారణలో సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు సాహు ఒప్పుకున్నారు. తలమీద గట్టిగా కర్రతో కొట్టి సనాఖాన్ ని చంపేసినట్లు, ఆ తర్వాత ఊరికి దూరంగా నదిలో శవాన్ని పారేసినట్లు సాహు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సనాఖాన్ శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక పరమైన గొడవల కారణంగా సనాఖాన్ ని తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలియజేసారు.