Page Loader
Special Trains: దసరా కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఏకంగా 6వేల ప్రత్యేక రైళ్లు  

Special Trains: దసరా కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఏకంగా 6వేల ప్రత్యేక రైళ్లు  

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పండగ సీజన్‌ ప్రారంభం కావడంతో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, ఛత్ పండుగలతో దేశవ్యాప్తంగా రద్దీ పెరుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమవుతోంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజా ప్రకటనలో పండగల సీజన్‌లో ప్రయాణికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 108 రెగ్యులర్‌ ట్రైన్స్‌తో పాటు అదనంగా 5,975 స్పెషల్‌ ట్రైన్స్‌ను నడపనుంది.

Details

యాత్రికుల కోసం మరిన్ని రైళ్లు

12,500 కోచ్‌లు సిద్దంగా ఉంచి, యాత్రికులకు మరింత సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రత్యేక రైళ్లు ప్రధానంగా అక్టోబర్ 12న దసరా, అక్టోబర్ 31న దీపావళి, నవంబర్ 7న ఛత్ పూజ వంటి పండుగల కోసం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.