Page Loader
UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు
పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు

UP: పెళ్లి మండపంలోకి చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన వధూవరులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలో చిరుత పులి ప్రవేశించి పెళ్లి వేడుకను క్షణాల్లో గందరగోళంగా మార్చింది. పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యి వేడుక ప్రారంభం కావాల్సిన తరుణంలో చిరుత అనూహ్యంగా మంటపంలోకి ప్రవేశించడంతో వధూవరులు, బంధువులు భయంతో పరుగులు తీశారు. లక్నో పారాలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్ సమీపంలోని ఎంఎం లాన్ వేదికగా జరిగిన ఈ ఘటన పెళ్లి మూడ్‌ను ఒక్కసారిగా భయాందోళనతో నింపింది. తక్షణమే పెళ్లి బంధువులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు.

Details

అటవీశాఖ అధికారులపై దాడి

అయితే రెస్క్యూ ప్రక్రియ మధ్యలో చిరుత ఒక్కసారిగా అటవీ అధికారులపై దాడి చేయడంతో ఒక అధికారి గాయపడ్డారు. దీంతో రెస్క్యూ టీమ్ సైతం అప్రమత్తమై మరింత జాగ్రత్తగా ప్రక్రియను కొనసాగించింది. కొన్ని గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో చివరకు చిరుతను చాకచక్యంగా బంధించి, సురక్షితంగా అడవికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రత్యక్షమైన చిరుత పులి