Page Loader
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త పీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అధునాతన సౌకర్యాలు, సాంకేతిక మెరుగులతో 25 కొత్త ఫీచర్లును వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వేశాఖ జోడించనున్నట్లు ప్రకిటించారు. భారతీయ రైల్వే ప్రస్తుతం 25 రూట్లలో 50 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ఆరెంజ్, గ్రే కొత్త కలర్‌తో సహా 25 కొత్త ఫీచర్‌లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ మార్పులకు భారతీయ రైల్వే శ్రీకారం చుట్టనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అప్ గ్రేడ్ చేయనున్న కొత్త ఫీచర్ల ఇవే.. సీట్లలోని కుషన్‌లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. సీట్ల రీక్లైనింగ్ యాంగిల్స్‌ విశాలంగా ఉండేలా రీడిజైన్ చేయనున్నారు.

వందేభారత్

ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లోని సీట్ల రంగు మార్పు

మరుగుదొడ్లలో నీరు చిమ్మకుండా ఉండటానికి వాష్ బేసిన్ లోతును పెంచనున్నారు. సీట్ల క్రింద ఉన్న మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లను మరింత సులభతరం చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లోని సీట్లు ఎరుపు నుంచి ఆహ్లాదకరమైన నీలం రంగులోకి మార్పు. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేసేలా వీల్‌చైర్‌లకు ఫిక్సింగ్ పాయింట్‌లను ఏర్పాటు. బయటి నుంచి ప్రజలు రైలు ఎక్కకుండా ఉండేందుకు కోచ్‌లకు యాంటీ-క్లైంబింగ్ డివైజ్‌ను అమర్చడం. మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి కోచ్‌లలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను మెరుగుపర్చడం.

వందేభారత్ 

టాయిలెట్లలో లైటింగ్ 2.5 వాట్‌లకు పెంపు

పెద్దవారికి స్క్రీన్‌లో సమాచారం కనపడేలా పెద్దవి ఏర్పాటు చేయడం. మంటలను సులభంగా గుర్తించడానికి, అవి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కోచ్‌లలో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ పకడ్బందీగా ఏర్పాటు. మంచి నీటి నియంత్రణకు వాటర్ ట్యాప్ ఏరేటర్ ఏర్పాటు. టాయిలెట్లలో లైటింగ్ 1.5 వాట్‌ల నుంచి 2.5 వాట్‌లకు పెంపు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాస్ ఎండ్ సీట్ల కోసం మ్యాగజైన్ బ్యాగ్‌ల ఏర్పాటు. టాయిలెట్ ప్యానెల్‌ల కోసం స్టాండర్డ్ కలర్స్ మొత్తం ఒకే రకమైన రంగులు వేయడం. అత్యవసర సమయంలో డ్రైవర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి సులభంగా యాక్సెస్ కోసం మెరుగైన హామర్ బాక్స్ కవర్ ఏర్పాటు.