
మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.
ఒక వ్యక్తి బట్టలు విప్పి, కొందరు అతన్ని దారణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దొంగతనం చేశాడనే నెపంతో కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని కొట్టినట్లు ఆ వీడియోలోని మాటల ద్వారా అర్థమవుతుంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్ కాంత ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
#सागर- युवक को निर्वस्त्र कर बेरहमी से पीटने का वीडियो सोसल मीडिया में वायरल,सागर का बताया जा रहा है वीडियो,पीड़ित और आरोपी युवको की पहचान नही हुई,
— Journalist Parasram (@SahuParsram1) July 9, 2023
पुलिस के पास अभी तक कोई शिकायत भी नही पहुंची है...!!
मोतीनगर थाने मे अज्ञातों के खिलाफ FIR की कवायद..@SPSagarmp #sagar #viralvideo pic.twitter.com/qDGpExeqbx
మధ్యప్రదేశ్
ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం: అడిషనల్ ఎస్పీ విక్రమ్ సింగ్
వీడియోలో నగ్నంగా ఉన్న వ్యక్తి గోడకు ఆనుకుని ఉన్నట్లు కనిపించాడు. అతని బట్టలు పక్కన పడి ఉన్నాయి. వారు పదేపదే పైపులతో అతని చేతులపై కొట్టడం కనిపిస్తుంది. ఈ విషయంపై అడిషనల్ ఎస్పీ విక్రమ్ సింగ్ కుష్వాహా స్పందించారు.
వీడియోకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, విచారణ చేపట్టామని తెలిపారు. వీడియో ఎప్పుడు చిత్రీకరించారు? ఘటన ఎక్కడ ఘటన జరిగింది? వీడియోలో కనిపిస్తున్న నిందితులు ఎవరనేది నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరో సంఘటనలో శివపురి జిల్లాలోని వర్ఖాడి గ్రామంలో కొంతమంది బాలికలను వేధించారనే అనుమానంతో జూన్ 30న ఇద్దరు దళిత యువకులను మైనారిటీ వర్గానికి చెందిన వారు కొట్టారు.