Swiss Woman: దిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి..
ఈ వార్తాకథనం ఏంటి
30 ఏళ్ల స్విస్ మహిళ హత్య కేసులో దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో స్విస్ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహం చేతులు, కాళ్లు గొలుసులతో కట్టివేయగా, శరీరం పైభాగంలో నల్లటి ప్లాస్టిక్‌తో కప్పబడి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు.
నిందితుడిని గురుప్రీత్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గురుప్రీత్ సింగ్, బాధితురాలు స్విట్జర్లాండ్‌లో కలిశారు.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్య పెరిగింది. స్విస్ మహిళ వేరొకరితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని నిందితుడు అనుమానించారు. దీంతో ఆమెను హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దిల్లీ
ఇండియాకు ఫోన్ చేసి హత్యకు ప్లాన్ చేశాడు
గురుప్రీత్ సింగ్, స్విస్ మహిళ మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళను కలిసేందుకు గురుప్రీత్ తరచూ స్విట్జర్లాండ్ వెళ్లేవాడు.
ఆమెకు వేరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో నిందితుడు ఈసారి భారత్‌కు రావాల్సిందిగా ఆ మహిళను చెప్పాడు.
దీంతో ఆమె ఇండియాకు వచ్చింది. గురుప్రీత్ సింగ్ ఆ మహిళకు పూజల పేరుతో ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తిలక్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ కెమెరా ఫుటేజీ సాయంతో పోలీసులు మృతదేహాన్ని కారులో ఘటనా స్థలానికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆ కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.