Page Loader
ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్ 
ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్

ఆర్టికల్ 370: పాక్ అనుకూల నినాదాలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేతకు సుప్రీంలో షాక్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ 15వ రోజున, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మహ్మద్ అక్బర్ లోనే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ కేంద్రం అఫిడవిట్‌ను కోరింది. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370 రద్దును సవాల్​ చేసిన వారిలో అక్బర్​ లోన్​ ప్రధాన పిటిషనర్​ అని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ధర్మాసనానికి కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సొలిసిటర్ జనరల్ మెహతా మాట్లాడుతూ..రాజ్యాంగానికి అక్బర్ లోన్ విధేయత చూపుతున్నట్లు ప్రకటించాల్సి ఉందన్నారు. సభా వేదికపై అలా నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Details 

వాదనలు వినే సమయంలో అక్బర్ నుంచి క్షమాపణలు కోరుతాం 

సీజేఐ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్బర్​ తరఫున​ వాదనలు వినే సమయంలో ఆయన నుంచి క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటన కోరతామని తెలిపింది. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను చూశామని, కోర్టులో సమర్పించిన వాటిని కూడా అబ్సర్వ్ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. సీనియర్​ నాయకుల నుంచి వచ్చిన ఇటువంటి ప్రకటనలు.. వారి సొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయని సొలిసటర్​ జనరల్​ కోర్టుకు తెలిపారు. ఒకవేళ వారు చేసినటువంటి అలాంటి వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే.. అది ఇతరులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్​లో సాధారాణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు చేపట్టిన వివిధ రకాల చర్యలపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు.

Details 

అక్బర్​ లోన్ అఫిడవిట్​ను తప్పనిసరిగా సమర్పించాలి 

ఆర్టికల్​ 370 రద్దుపై సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా వాదనలను సమర్థిస్తున్న సీనియర్​ న్యాయవాదులు రాకేశ్​ ద్వివేది, గిరి కూడా ఆయనకు మద్దతిచ్చారు. అక్బర్​ లోన్​ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్​ను తప్పనిసరిగా సమర్పించాలన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న లోన్ రాష్ట్ర అసెంబ్లీలో, ఇతర ప్రదేశాలలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఎలా చేశారని కాశ్మీరీ పండితులతో కూడిన బృందం,అలాగే రూట్స్​ ఇన్​ కశ్మీర్​ అఫిడవిట్‌లో ప్రశ్నించింది.