
ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ మధు యాష్కీకి ఇవ్వొందంటూ వెలిసిన పోస్టర్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పోస్టర్ల వార్ నడుస్తోంది.
ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్‌ను మధు యాష్కికి ఇవ్వొద్దంటూ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ గోడలపై సోమవారం పోస్టర్లు వెలిశాయి.
ఎల్బీ నగర్ కాంగ్రెస్ టికెట్ కోసం మధుయాష్కి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే 'పారాచూట్' నేతలకు టికెట్ ఇవ్వొద్దని ఆ పోస్టర్లలో రాసి ఉంది.
కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ చిత్రాన్ని ప్రత్యేకంగా ఆ పోస్టర్లలో ముద్రించారు.
'సేవ్ ఎల్‌బీ నగర్ కాంగ్రెస్, దయచేసి పారాచూట్‌లకు టికెట్ లేదు అని చెప్పండి. మధు యాష్కీ నిజామాబాద్‌కు తిరిగి వెళ్లాలి' అని ఆ పోస్టర్లలో రాసి ఉంది.
పోస్టర్
పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం: మధు యాష్కీ గౌడ్
తనకు వ్యతిరేకంగా అంటించిన పోస్టర్లపై మధు యాష్కీ గౌడ్ స్పందించారు. ఈ పోస్టర్ల వెనుక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని మధుయాష్కీ గౌడ్ చెప్పారు.
ఒడిపోతాననే భయంతోనే సుధీర్ రెడ్డి తనపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్‌బీ నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మిత్రులను కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎల్‌బీ నగర్ కాంగ్రెస్ టికెట్‌ను సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి, మరో నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆశిస్తున్నారు.
ఇప్పుడు ఈ రేసులోకి మధు యాష్కీ రావడంతో ఇక్కడ టికెట్ కోసం ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాంధీ భవన్ గోడలపై వెలసిన పోస్టర్లు
“Save LB Nagar Congress”, “Go back to Nizambad” read posters put up against Madhu Yashki urging not to give ticket to “Parachutes” pic.twitter.com/1G4mSi78wS
— Naveena (@TheNaveena) September 4, 2023