Page Loader
Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో వ్యాన్‌ను బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి వెలికి తీశారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.