మహారాష్ట్రలో 500 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న ప్రధాని
బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ పేరిట 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం మహారాష్ట్రలోని 34 గ్రామీణ జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రం కనీసం రెండు వృత్తి విద్యా కోర్సుల్లో సుమారు 100 మంది యువకులకు శిక్షణనిస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కింద ఎంప్యానెల్డ్ ఇండస్ట్రీ పార్టనర్‌లు,ఏజెన్సీల ద్వారా శిక్షణను అందిస్తున్నారని పేర్కొంది. ఈ కేంద్రాల స్థాపన ప్రాంతం మరింత సమర్థమైన,నైపుణ్యం కలిగిన మానవశక్తిని అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించడంలో సహాయపడుతుంది.