Canada: కెనడాలో AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పుల కలకలం
ప్రముఖ పంజాబీ గాయకుడు AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయన్న వార్త కెనడాలో కలకలం రేపుతోంది. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని సమాచారం. గాయకుడు సల్మాన్ ఖాన్ నటించిన "ఓల్డ్ మనీ" మ్యూజిక్ వీడియో విడుదల చేసిన కొద్దిరోజుల తరువాత ఈ దాడి జరిగింది. విక్టోరియా ద్వీపం ప్రాంతంలోని AP ధిల్లన్ ఇంటి సమీపంలో ఆదివారం రాత్రి కాల్పుల శబ్దం వినిపించిందని వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అధికారిక ప్రకటన ఇవ్వని కెనడా పోలీసులు
లారెన్స్ బిష్ణోయ్-రోహిత్ గోదారా గ్యాంగ్ ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పాటు, సోషల్ మీడియాలో గ్యాంగ్ AP ధిల్లన్‌కు బెదిరింపు సందేశాలను కూడా పంపింది. సల్మాన్ ఖాన్‌తో ఉన్న సంబంధాలపై ప్రశ్నించిన గ్యాంగ్, AP ధిల్లన్‌కు హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పోలీసుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ నివాసంలో కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.