Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో గన్‌తో కాల్చుకున్న యువకుడు
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు గమనించి బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొంతమంది వీఐపీలు స్వర్ణ దేవాలయానికి దేవుని దర్శనం కోసం విచ్చేశారు. వారి భద్రతా సిబ్బంది ఆలయం బయట నిలుచున్న సమయంలో ఓ యువకుడు ఆ గన్‌మెన్ దగ్గర పిస్టల్‌ను లాక్కుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు
గన్ కాల్పులు జరగడం తో ప్రాంగణంలో ఉన్న భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసుల విచారణ ప్రకారం, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు వలసదారుడని అనుమానిస్తున్నారు. అతని వివరాలకు ఇంకా తెలియరాలేదు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు.