
Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1 నుంచి ఆధార్ ఆధారిత హాజరు విధానం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల 1వ తేదీ నుండి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం మేరకు వైద్య శాఖ కార్యదర్శి క్రిస్టినా బుధవారం అధికారిక ఆదేశాలను జారీచేశారు. వైద్య విద్య సంచాలకుడు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుడు,ఆయుష్ విభాగాల పరిధిలో ఉన్న అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
వివరాలు
కొత్త విధానంపై వైద్యులు,ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ
ఇది సక్రమంగా అమలయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, వైద్యులు,ఆసుపత్రి సిబ్బందికి ఈ కొత్త విధానంపై తగిన శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ లోగా మొత్తం ప్రక్రియను పూర్తిచేయాలని, తదుపరి రోజు నుండి అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకురావాలని స్పష్టమైన సూచనలు చేశారు.