AAP: దిల్లీ ఎన్నికల్లో ఓటమితో ఆప్‌కి షాక్.. పంజాబ్‌లో మోడల్ మార్చక తప్పదా?
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ పార్టీ స్థాయిని సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీకి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
దేశవ్యాప్తంగా 'దిల్లీ మోడల్'ను ప్రచారం చేసిన ఆ పార్టీకి స్వయంగా దిల్లీ ప్రజలే తిరస్కరణ పలకడంతో, భవిష్యత్ కార్యాచరణపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం పంజాబ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్, అక్కడ తన పాలన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
దిల్లీ మోడల్‌ను దిల్లీ ప్రజలే తిరస్కరించేశారు. అదే మోడల్‌ను అమలు చేస్తున్న పంజాబ్‌లో ప్రజలు ఎలా స్వీకరిస్తారు?'' అని పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షాహీద్ భగత్ ప్రశ్నించారు.
Details
ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అవసరం
ఇదే విషయాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ కూడా సూచిస్తూ, పంజాబ్ కోసం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అవసరమని తెలిపారు.
దిల్లీ మాదిరిగా పంజాబ్‌లో ఉచిత కరెంటు, మహిళలకు నెలకు రూ. 1000 ఆర్థిక సాయం, మెరుగైన విద్యా, ఆరోగ్య సదుపాయాలను హామీగా ఇచ్చి 2022లో 117 స్థానాల్లో 92 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన ఆప్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం 13 స్థానాలకు గాను 3 స్థానాల్లోనే గెలిచింది.
దిల్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు ఆశించిన విధంగా స్పందించలేదు.
Details
పంజాబ్ లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం
దీంతో రానున్న రోజుల్లో పంజాబ్‌లో ఆప్‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశముందన్నారు.
2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షాలకు ఇది మంచి అవకాశం కల్పించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఆప్ నేతలు ప్రలోభాలకు గురికాకుండా పార్టీని ఎంత పటిష్ఠంగా ఉంచగలరో అనేదే భవిష్యత్‌ను నిర్ణయించనుంది.