Page Loader
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. వర్షాకాల సమావేశాల నుంచి ఎంపీ సంజ‌య్ సింగ్‌ స‌స్పెండ్
వెల్‌లోకి దూసుకెళ్లిన ఆప్ ఎంపీ

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. వర్షాకాల సమావేశాల నుంచి ఎంపీ సంజ‌య్ సింగ్‌ స‌స్పెండ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 24, 2023
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల స‌మావేశాలు వేడెక్కుతున్నాయి. మణిపూర్ అంశంపై విపక్షాల రచ్చ చేస్తున్నాయి. మరోవైపు అధికార పక్షం ఆయా సభ్యులను కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ వెలుపల విపక్షాల సభ్యులు నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతున్నాయి. ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై సోమవారం వేటు పడింది. సమావేశాలు ముగిసే వరకు ఈ స‌స్పెన్ష‌న్ అమల్లో ఉంటుందని పెద్దలసభ ప్రకటించింది. రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్న క్రమంలో ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ జవాబు ఇచ్చారు. అదే స‌మ‌యంలో ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ వెల్‌లోకి దూసుకువెళ్లారు.

DETAILS

నిజం మాట్లాడినందుకే సస్పెన్షన్ : ఆప్

అక్కడితో ఆగకుండా మ‌ణిపూర్ అంశంపై నినాదాలు చేస్తూ చ‌ర్చకు ప‌ట్టుప‌ట్టారు. ఒక దశలో ఎంపీని వెనక్కి వెళ్లాలని, తన సీట్లో కూర్చోవాలని ఛైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ హెచ్చరించారు. అయినా సదరు ఆదేశాలను సంజయ్ భేఖాతరు చేశారు. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్ అతనిపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ సంజ‌య్‌ను స‌స్పెండ్ చేస్తున్నట్లు లీడ‌ర్‌ ఆఫ్ ద హౌజ్(రాజ్యసభ నాయకుడు) పీయూష్ గోయ‌ల్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టగా ఛైర్మన్ ఆమోదించారు. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్‌పై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. నిజం మాట్లాడినందుకే సస్పెన్షన్ విధించారన్నారు. అయితే తామేమీ మనస్తాపం చెందట్లేదని చెప్పుకొచ్చారు. సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు.