
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్.. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల..
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మొదటి జాబితాను ప్రకటించింది, ఇందులో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఈ జాబితాలో ఇటీవల కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు కూడా ఉన్నారు.
ఇతర పార్టీల నుంచి ఆప్‌లో చేరిన ఈ నాయకులను పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారు.
ఇదే జాబితాలో బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా చోటు పొందాయి.
వివరాలు
తొలి జాబితాలోని ఆప్ అభ్యర్థులు వీరే..
* బ్రహ్మ సింగ్- తన్వార్ ఛతర్‌పూర్, * అనిల్ ఝా- కిరాడీ, * దీపక్ సింగ్లా- విశ్వాస్ నగర్, * సరితా సింగ్- రోహతాస్ నగర్, * బిబి త్యాగి- లక్ష్మీ నగర్, * రామ్‌సింగ్ నేతాజీ- బదర్‌పూర్, * జుబేర్ చౌదరి- సీలంపూర్, * వీర్ సింగ్ ధింగన్- సీమాపురి, * గౌరవ్ శర్మ- ఘోండా, * మనోజ్ త్యాగి- కరావాల్ నగర్, * సోమేష్ షౌకీన్- మటియాలా
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ ఎన్నికలకు ఆప్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..
First list of AAP candidates for Delhi Elections is OUT‼️
— Vishvender Singh (@VishvenderAap) November 21, 2024
All the best to all the candidates ✌️🏻
फिर लायेंगे केजरीवाल ! 🔥 pic.twitter.com/3mYjFmczR2