Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీగా స్వాతి మలివాల్ నామినేట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)శుక్రవారం ఢిల్లీ మహిళా కమిషన్(DCW)చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ను అభ్యర్థిగా నామినేట్ చేసింది.
మలివాల్‌తో పాటు, మద్యం కుంభకోణంలో ప్రస్తుతం జైలులో ఉన్న సంజయ్ సింగ్,ND గుప్తాను కూడా AAP రెండవసారి పార్లమెంటు ఎగువ సభకు తిరిగి నామినేట్ చేసింది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మలివాల్ పేరు ప్రస్తావనకు వచ్చింది.
ఢిల్లీలో రాజ్యసభ ఎన్నికలకు ఆప్ నామినేషన్లను ఖరారు చేసేందుకు కమిటీ సమావేశమైంది.
చిన్న వయస్సులోనే స్వాతి మలివాల్ DCW చీఫ్ గా నియమితులయ్యారు.ఆమె ఢిల్లీలో మహిళల పట్ల జరిగిన దాడులతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు సంఘటనలపై చురుకుగా వ్యవహరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆప్ రాజ్యసభ ఎంపీగా స్వాతి మలివాల్
AAP से स्वाति मालिवाल राज्यसभा जाएंगी#SwatiMaliwal | Swati Maliwal | Rajya Sabha | #RajyaSabha pic.twitter.com/1b3W3osyf3
— News24 (@news24tvchannel) January 5, 2024