Page Loader
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 30, 2023
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఉండాలని ఆప్‌ ఆకాంక్షిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి, రేపు, ఎల్లుండి మూడోసారి భేటీ కానుంది. దిల్లీ సీఎంగా, దేశానికే ఓ రోల్ మోడల్‌ను అందించిన కేజ్రీవాల్‌, కూటమికి నేతృత్వం వహించి, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆప్ అభిప్రాయపడింది. ముంబైలో నేడు కీలక మూడో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఆప్‌ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ ను కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ మేరకు కూటమికి జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌ పేరును ప్రతిపాదిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీలో ఉచిత నీరు,ఉచిత విద్య అందించిన కేజ్రీవాల్, ప్రధాని అభ్యర్థి : ప్రియాంక కక్కర్