Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో బీజేపీ నుంచి ఆప్‌లో చేరిన ప్రొఫెసర్ ఛత్రపాల్‌ను బర్వాలా నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఆప్ 29 మంది అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా సధైరా నుంచి రీటా బమ్నేయ, థానేసర్ నుంచి కృష్ణ బజాజ్, ఇంద్రి నుంచి హవా సింగ్‌లకు టిక్కెట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాటియా నుంచి ముక్త్యార్ సింగ్ బాజిగర్, అడంపూర్ నుంచి అడ్వకేట్ భూపేంద్ర బెనివాల్, బవాల్ నుంచి జవహర్‌లాల్‌ను అప్ అభ్యర్థులుగా ప్రకటించింది. ఫరీదాబాద్ నుంచి ప్రవేశ్ మెహతా, తిగావ్ నుంచి అబాష్ చండేలాకు కూడా టిక్కెట్లు ఇచ్చారు.