Page Loader
Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 
ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

Sunitha Kejriwal: ఆప్ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం.. గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కటకటాల పాలయ్యారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని సీఎం తెలిపారు. ఇదిలా ఉంటే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆప్ గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, సంజయ్ సింగ్,రాఘవ్ చద్దా,సౌరభ్ భరద్వాజ్,అతిషి, సందీప్ పాఠక్ పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో భగవంత్ మాన్,మనీష్ సిసోడియా,సత్యేంద్ర జైన్ కూడా ఉన్నారు. జాబితా వెలువడిన తర్వాత తీహార్ జైలులో ఉన్న పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన జైల్లో ఉంటే గుజరాత్‌లో పార్టీ తరపున ఎలా ప్రచారం చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 క్యాంపెయినర్ల జాబితా ఇదే..

Details 

ఏప్రిల్ 23 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇవ్వగా చివరిసారిగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది.తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది.