
Arogyasri: ఏప్రిల్ 7 నుంచి ఆంధ్రలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో 2025, ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నారు.
పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
గత 10 నెలల్లో పాత బకాయిల కోసం 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు పంపించినప్పటికీ, ఇప్పటికీ స్పందన లేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.3,500 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.
వివరాలు
అసోసియేషన్ సభ్యులతో చర్చలు
పాత బకాయిలు పూర్తి చేసి, భవిష్యత్తులో బిల్లులను సకాలంలో చెల్లించేవరకు వైద్య సేవలను పునరుద్ధరించబోమని అసోసియేషన్ స్పష్టంచేసింది.
ఈ ప్రకటనతో ప్రభుత్వం అప్రమత్తమై, అసోసియేషన్ సభ్యులతో చర్చలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని .. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాల్సిందిగా అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.