
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ నిన్న రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలు, సహకార అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన"ఇన్వెస్టోపియా గ్లోబల్" కార్యక్రమంలో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,"దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుని కేవలం ఐదు నిమిషాలు కలిశాను.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాం
అయితే ఆ కొద్ది సమయంలోనే ఆయనలోని స్పష్టమైన దృష్టికోణం,ఆలోచనా శైలి నాకు ఎంతో ఆకర్షణగా అనిపించాయి. అందుకే మేము కేవలం ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాం" అని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, యూఏఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో కూడా విశేష పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దావోస్‌లో చంద్రబాబు విజన్ నచ్చి..
5 నిమిషాలు దావోస్‌లో చంద్రబాబు గారితో మాట్లాడాను. ఆయన విజన్ నచ్చి 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి మేము వచ్చాం : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ #InvestopiaGlobal#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/Ni9Zuk4gSX
— Telugu Desam Party (@JaiTDP) July 23, 2025