ACB Rides: కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఈ వార్తాకథనం ఏంటి
కేటీఆర్ ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గచ్చిబౌలిలో ఉన్న ఓరియన్ విల్లాస్‌లో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ సోదాలు చేస్తారని కేటీఆర్ ముందుగానే అనుమానం వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ కారు రేసులో 2024 డిసెంబర్ 19న కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, అరవింద్ కుమార్‌ను ఏ2గా, బీఎస్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చారు.
ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని ఈడీ కేటీఆర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
హైకోర్టు, తీర్పు రిజర్వ్
ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది.
తీర్పు వెలువడే వరకు కేటీఆర్‌పై ఏవైనా తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.