Adimulapu Suresh: మాజీ మంత్రి ఇంటి నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 11, 2024
03:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేష్ ఇంటి నిర్మాణ పనుల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని చెన్నకేశవ నగర్‌లో మాజీ మంత్రి సురేష్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. పనులు చురుగ్గా సాగుతున్న క్రమంలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ తగిలింది . దీంతో వారిద్దరూ అక్కడిక్కడే మరణించారు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.