SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
ఈ వార్తాకథనం ఏంటి
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇటీవల పనులను తిరిగి ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఉదయం ప్రమాదం సంభవించింది.
అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Details
ప్రమాద సమయంలో టన్నెల్‌లో 40 మంది కార్మికులు
శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద సొరంగ మార్గం నిర్మాణం కొనసాగుతోంది.
ప్రమాదం సంభవించిన సమయంలో 40 మంది కార్మికులు మొదటి షిఫ్ట్‌లో సొరంగంలో ఉన్నారు. ఉదయం 8:30 గంటల సమయంలో పైకప్పు కూలిపోవడంతో మట్టిపెల్లలు విరిగి కార్మికులపై పడ్డాయి.
దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఏడుగురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
Details
సీఎం రేవంత్ రెడ్డి స్పందన
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఘటనాస్థలికి బయలుదేరారు.