
KCR Convoy Accident: మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం...ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)కాన్వాయ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.
ఆయన వాహన శ్రేణిలోని ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.నల్లగొండ జిల్లా వేములపల్లి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వాహన శ్రేణిలోని కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.అయితే ఈ ప్రమాదం లో ఎవరూ గాయపడదలేదని సమాచారం.
ముందు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బీఆర్ ఎస్ నేతలకు పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బస్సు యాత్ర, రోడ్ షో ల ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొ్గంటున్నారు.
బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం మే నెల 10 వ తేదీన సిద్ధిపేట సభతో ముగియనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేసీఆర్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024
కేసీఆర్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం
వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీకొన్న పదికి పైగా వాహనాలు.. ఎవరికి ఏమి కాకపోవడంతో యధావిధిగా సాగుతున్న కేసీఆర్ కాన్వాయ్.