భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట
భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది. దేశంలోని రూ.నెలకు 40,000 వేతనం వచ్చే భర్తలు తమ భార్యలను చదువు వైపు, లేక ఉద్యోగం వైపు ప్రోత్సహిస్తున్నారని అధ్యయనం చెబుతోంది. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023' పేరుతో చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయ సమాజంలో సాధారణంగా భర్తలను సంపాదకులుగా పరిగణిస్తారు. భార్యలు పని చేయడానికి అంగీకరించరు. భార్యలు అవసరమైనప్పుడు మాత్రమే ఇంటి ఆదాయానికి సహకరిస్తారు. కానీ ఇప్పుడు ఆ రోజులకు కాలం చెల్లినట్లు తాజా అధ్యయనం చెబుతోంది.
గ్రామాల్లో 50శాతం, పట్టణాల్లో 70శాతం పెరుగుదల
భర్తలు గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే కుటుంబాల్లో భార్యలు ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం తగ్గిపోతుందని ఈ అధ్యయనం చెప్పింది. కానీ గ్రామీణ భారతంలో భర్త ఆదాయం పెరిగినా, భార్యలు పని చేయడానికి ఇష్టపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, పట్టణ భారతదేశంలో భర్తల సంపాదన నెలకు రూ.40,000 ఉన్న భార్యలు ఉద్యోగాన్ని కోరుకోవడం పెరిగినట్లు అధ్యయనం చెబుతోంది. పని చేసే అత్తగారు లేని కుటుంబాలతో పోలిస్తే, అత్తగారు ఉద్యోగం చేస్తున్న కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 50శాతం, పట్టణ ప్రాంతాల్లో 70శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడం గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.