LOADING...
PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ 
యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ

PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Jul 22, 2023
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఆ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 44కి పైగా చోట్ల జరిగిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొత్తగా ఉద్యోగం పొందిన 70,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను వర్చువల్‌గా పంపిణీ చేశారు. వీరిలో ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగానికే చెందిన వారే ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

మోదీ

అప్పుడు నష్టాల్లో, ఇప్పుడు లాభాల్లో: మోదీ

ప్రభుత్వ బ్యాంకులు గతంలో వేల కోట్ల నష్టాలకు, నిరర్థక ఆస్తులకు (ఎన్‌పీఏ) పేరుగాంచాయని, ఇప్పుడు రికార్డు స్థాయిలో లాభాలు గడిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 'ఫోన్ బ్యాంకింగ్ కుంభకోణం' గత యూపీఏ హయాంలో జరిగిన అతి పెద్ద స్కామ్‌లలో ఒకటని, ఇది దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. దేశీయ బ్యాంకింగ్ వ్వవస్థ వెన్ను విరిచిందన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సానుకూల వాతావరణం నెలకొందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలు నిర్వహించారు. కొత్తగా రిక్రూట్ అయిన అభ్యర్థులు వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో విధుల్లో చేరనున్నారు.