Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సెల్ నంబర్ 21లో ఉన్నాడు. అయితే అతడికి సంబంధించి ఓ వార్త బయటికి రావడంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితుడికి నిన్న రాత్రి జైలులో మటన్, రోటీ అందించారని తెలిసింది. ఈ వార్త తెలియడంలో నిందితుడికి జైలులో పెట్టి మేపుతున్నారంటూ పలువురు తీవ్రంగా విమర్శస్తున్నారు.
ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలు
ఆత్యాచార ఘటనకు కారణమైన సంజయ్ రాయ్ ని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్య కేసులో మొత్తం ఏడుగిరికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. సీఐడీ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, నలుగురు వైద్యులతో పాటు ఒక వాలంటీర్‌కు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇందులో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. నిందితుడు సమాధానం చెప్పే సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది తెలియనుంది.