
Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.
దీంతో పలు రాష్ట్రాల్లో డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. బస్సులు, ట్రక్కుల డ్రైవర్లు సమ్మె చేయడంతో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడింది.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఇంధన కొరత సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్)ని మార్చింది. ఇందులో కొన్ని నిబంధలను కఠినతరం చేసింది.
కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా ప్రమాదానికి కారణమై, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుండి పారిపోతే.. అతనికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
సమ్మె
మహారాష్ట్రలో ఇంధన కొరత
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ట్రక్కు డ్రైవర్లు 'రాస్తారోకో' నిరసనలు చేపట్టారు.
ప్రధాన రహదారులను మూసివేశారు. దీంతో చాలా చోట్ల ఇంధన కొరత ఏర్పడింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు కొంతసేపు ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఒక పోలీసు గాయపడ్డాడు.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లో బస్సు, లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. రాష్ట్రంలోని 12,000 మందికి పైగా బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు.
బస్సులు ఆగిపోవడంతో రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్‌తో సహా ఇతర నగరాల బస్ స్టేషన్‌లలో వందలాది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
సమ్మె
పశ్చిమ బెంగాల్‌లో నిరసన హింసాత్మకం
పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో డ్రైవర్లు చేపట్టన నిరసన హింసాత్మకంగా మారింది.
హుగ్లీ జిల్లాలోని దంకుని టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి నంబర్ 2ను సుమారు రెండు గంటలపాటు దిగ్భందించారు.
పంజాబ్
డ్రైవర్ల సమ్మె ప్రభావం పంజాబ్ అంతటా కనిపిస్తోంది. డ్రైవర్లు బస్సులు, ట్రక్కులు నడపడం లేదు.
రోడ్లను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రోడ్‌వేస్, పంజాబ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పిఆర్‌టిసి) మరియు ప్రైవేట్ బస్ కంపెనీలకు సంబంధించిన డ్రైవర్లు కూడా సమ్మెలో ఉన్నారు.
మధ్యప్రదేశ్
భోపాల్‌లో లాల్ ఘాటి వద్ద డ్రైవర్లు నిరసన తెలిపారు.
రాష్ట్రంలోని అనేక నగరాల్లో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి.