
Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
భద్రతా దళాల కదలికలు, ఆపరేషన్ల కవరేజీ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరింది.
'దళాల ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను ఓవరాకింగ్‌గా ప్రచురిస్తే... అది వారి మిషన్‌పై ప్రభావం చూపించడమే కాకుండా, ప్రాణహానికీ దారి తీసే ప్రమాదం ఉందని ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల జరిగిన కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై ఉగ్రదాడులు, కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో జరిగిన అత్యుత్సాహపు రిపోర్టింగ్ ఉదాహరణలుగా నిలిచినట్లు తెలిపింది.
Details
మీడియా ప్రతినిధులు బాధ్యతయుతంగా వ్యవహరించాలి
కేబుల్ టెలివిజన్ చట్టాన్ని ఉల్లేఖించిన రక్షణశాఖ, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో నిబంధనల ప్రకారం కేవలం అర్హత గల అధికారులే సమయానుసారంగా అధికారికంగా వివరాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది.
మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఇంతకుముందు కార్వార్, గుజరాత్‌లోని ఓ పోర్టు, జలంధర్‌లో డ్రోన్‌లు, క్షిపణుల దాడుల దృశ్యాలంటూ కొన్ని పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది.
'ఆపరేషన్ సిందూర్' సమయంలో దేశవ్యాప్తంగా తప్పుడు వార్తలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు అవాస్తవమని తేల్చింది.