Page Loader
దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు 
దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కోవిడ్ కేసులు 60వేల మార్క్‌ను దాటాయి. గత 24గంటల్లో దేశంలో 9,111 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరినట్లు కేంద్రం చెప్పింది. దేశంలో కొత్తగా 27మంది మరణించారు. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,31,141కి పెరిగింది.

కరోనా

రోజువారీ పాజిటివిటీ రేటు 8.40శాతం

కొత్త మరణాల్లో గుజరాత్ నుంచి ఆరు నమోదవగా, ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగు, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి మూడు చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, బిహార్,ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు నుంచి ఒక్కరు చొప్పున, కేరళలో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,48,27,226)కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.40శాతంగా నమోదైంది. వారంవారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నిర్ణయించబడింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.68 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ట్వీట్