Ranveer Allahbadia: యూట్యూబర్ వ్యాఖ్యల వివాదం వేళ.. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన విడుదల చేసిన నటుడు రఘురామ్
ఈ వార్తాకథనం ఏంటి
'ఇండియాస్ గాట్ లాటెంట్' (IGL) షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
షో హోస్ట్ సహా జడ్జ్‌లు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ షోలో ఒక ఎపిసోడ్‌కు జడ్జిగా వ్యవహరించిన నటుడు రఘురామ్ (Actor Raghu Ram) మహారాష్ట్ర సైబర్ విభాగం ముందు హాజరై, అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు.
వివరాలు
ఇతరులను బాధించగల జోకులను షోలో ప్రదర్శించకుండా ఉండటం మంచిది
'ఇండియాస్ గాట్ లాటెంట్'లో భాగంగా పని చేయడం గురించి నాకు ఎలాంటి విచారం లేదు. అయితే, ఇతరులను బాధించగల జోకులను షోలో ప్రదర్శించకుండా ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. ఆ మేరకు ఎడిటింగ్ చేయడం సాధ్యమే. అయితే, షో హోస్ట్ సమయ్ రైనా, మేకర్స్ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థితిలో నేను లేను. వాళ్లు తమ బాధ్యతను తేలిగ్గా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఈ పరిణామాల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే, నా క్షమాపణలు. ఈ అంశాన్ని సమాజం సంయమనంతో చూసి, శాంతియుతంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాను,'' అని రఘురామ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
సమన్లు పంపినా,హాజరు కానీ రణ్‌వీర్ అల్హాబాదియా
ఈ షోకు సమయ్ రైనా హోస్ట్‌గా వ్యవహరించగా, గెస్ట్ జడ్జ్‌లుగా రణ్‌వీర్ అల్హాబాదియా, అపూర్వ ముఖిజా, జస్ప్రీత్ సింగ్, ఆశిష్ చాంచ్లానీ పాల్గొన్నారు.
ఇటీవల, షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగార విషయాలపై ప్రశ్నించినందుకు రణ్‌వీర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
ఈ సంఘటనపై అనేక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర సైబర్ విభాగం దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
రణ్‌వీర్ అల్హాబాదియాకు విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపినా, ఆయన హాజరు కాలేదు.
తద్వారా, ముంబయిలోని అతని నివాసానికి పోలీసులు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.