
Vijay: అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమిళ నటుడు విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూ ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఆయన తన సోషల్ మీడియా వేదికగా అంబేడ్కర్‌ను గౌరవిస్తూ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అంబేడ్కర్ అనే పేరు మనసుకు, పెదవులకు సంతోషాన్ని ఇస్తుంది
విజయ్ తన పోస్ట్‌లో, "కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని జాగృతం చేసిన అసమాన రాజకీయ మేధావి. ఆయన వారసత్వం అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతీక. అంబేడ్కర్ అనే పేరు మనసుకు, పెదవులకు సంతోషాన్ని ఇస్తుంది" అని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ చేసిన ట్వీట్
யாரோ சிலருக்கு வேண்டுமானால் அம்பேத்கர் பெயர் ஒவ்வாமையாக இருக்கலாம். சுதந்திரக் காற்றை சுவாசிக்கும் இந்திய மக்கள் அனைவருக்கும் அவர்கள் உயரத்தில் வைத்துப் போற்றும் ஒப்பற்ற அரசியல் மற்றும் அறிவுலக ஆளுமை, அவர்.
— TVK Vijay (@tvkvijayhq) December 18, 2024
அம்பேத்கர்...
அம்பேத்கர்... அம்பேத்கர்...
அவர் பெயரை
உள்ளமும் உதடுகளும்…
వివరాలు
అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే పార్టీ సిద్ధం
ఇంతలో, సినీరంగంలో దళపతిగా ప్రసిద్ధి పొందిన విజయ్ ఇటీవలే 'తమిళగ వెట్రి కళగం' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.
పార్టీ జెండాను కూడా ఆవిష్కరించిన ఆయన, పార్టీ మొదటి ర్యాలీలో బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె. కామరాజ్ వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే పార్టీ సిద్ధమవుతోందని విజయ్ తెలిపారు.