ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.
ఈ నేపథ్యంలో పార్టీకి జిల్లాలో భారీ షాక్ కు గురైంది. ఈ మేరకు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ పార్టీలో చేరనునున్నారని సమాచారం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మహోద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాడినప్పటికీ నిజమైన ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదని శ్రీనివాస రావు భావిస్తున్నారు. నిఖార్సైన ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం మూలానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
DETAILS
బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచించింది: శ్రీహరిరావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీహరిరావు జడ్పీ ఫ్లోర్ లీడర్ గా, అప్పటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో తన అనుచరులతో కలిసి ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటన చేశారు. అనేక హామీలతో తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ప్రజలను వంచించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను మోసగించడం ఇష్టం లేకనే అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని శ్రీహరిరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి తన రాజీనామా లేఖను సమర్పించారు.
DETAILS
భాజపా టచ్ లోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు
సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చింది ప్రజల కోసమేనని, ఈ మేరకు ఆ సత్యాన్ని గుర్తించిన జనం ఆమెకి మద్దతు పలుకుతున్నారన్నారు.
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వివరించారు. జూన్ 17 లోగా శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమ కాలం 2007లో శ్రీహరిరావు అప్పటి తెరాసలో చేరారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయన వ్యవహరించారు.
ఎక్కడ బహిరంగ సభ నిర్వహించినా శ్రీహరిరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ తో పంచుకునేవారు.
గతంలో భాజపా నేతలు కూడా శ్రీహరి రావుతో చర్చలు జరిపారని, అయితే శ్రీహరిరావు మాత్రం హస్తం గూటికి చేరేందుకే మొగ్గు చూపడం కొసమెరుపు.