ఈ ఏడాది దిగుబడిపై ప్రతికూల వాతావరణ ప్రభావం
వేసవి కాలం వచ్చిందంటే గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. మిలియన్ల మంది భారతీయులు మే- జూలై నెలల్లో మామిడి పండ్ల సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మామిడి ప్రియులకు నిరాశ ఎదురవుతోంది. ఇప్పటికే మామిడి పండ్లతో కళకళలాడాల్సిన మార్కెట్లు ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడి తగ్గి అమ్మకాలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లో కురిసిన భారీ వడగళ్ల వానలు మామిడి పంటపై తీవ్రమైన ప్రభావాన్నిచూపాయి. కాయలు ఎదగక ముందే రాలిపోవడంతో రైతులు అపార నష్టాన్ని మూటగట్టుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది. దేశంలో మామిడి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది ప్రతికూల వాతావరణ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది.
మామిడి దిగుబడిపై వడగళ్ల వానల ప్రభావం
ఈ వసంత రుతువు కాలంలో తేమ వాతావరణంతో పాటు, వడగళ్ళ వానలు పరాగసంపర్కానికి అవసరమైన తేనెటీగలు తరిమికొట్టాయని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలిహాబాద్‌కు చెందిన మామిడి రైతు సలీం మీర్జా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది దిగుబడి భారీగా తగ్గిపోవడానికి ప్రధానంగా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మామిడి చెట్లు ఎక్కువగా ఫిబ్రవరి, మార్చి మధ్య కాలంలో పూత దశకు వస్తుంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడి తరంగాల ఫ్రీక్వెన్సీ పెరిగినట్లు ఐఎండీ చెప్పింది. ఈ పరిణామం దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పుల వల్ల 20శాతం తోటలు త్వరగా పూత దశకు వచ్చినట్లు, ఈ సమయంలో వర్షాలు, వడగళ్ల వానలు పంట దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి.