
Afghanistan : భారత్‌లో ఆఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఇండియా సహకరించట్లేదన్న ఆప్ఘాన్ సర్కార్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తమ ఎంబసీని ఎత్తివేస్తున్నట్లు ఆప్ఘానిస్తాన్ సర్కారు కీలక నిర్ణయం ప్రకటించింది. దిల్లీలో పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.2023 నవంబర్ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.ఒకదశలో సెప్టెంబర్ 30 నుంచే అఫ్గాన్ ఎంబసీ కార్యకలాపాలు భారత్‌లో నిలిచిపోయాయి.
దౌత్య అధికారుల్లో కొంత మంది తాలిబన్ సర్కారుకు విధేయత ప్రకటించారు. దీంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశముందని ఎంబసీ ప్రకటనలో చెప్పింది.
దిల్లీలో రాయబార కార్యాలయ మూసివేతకు ఇదే కారణంగా వార్తలూ రావొచ్చని తెలిపింది. కానీ విధానాల్లో మార్పుల వల్లే ఎంబసీ క్లోజ్ చేస్తున్నామని వివరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీలో శాశ్వతంగా నిలిపోయిన ఆప్ఘనిస్తాన్ ఎంబసీ
The Embassy of the Islamic Republic of Afghanistan announces the permanent closure of its diplomatic mission in New Delhi. pic.twitter.com/PV1AxiXQ0h
— ANI (@ANI) November 24, 2023