Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ శుక్రవారం బీజేపీలో చేరారు. తనపై నిఘా ఉంచారన్న విషయం తెలిసి తాను కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఒకప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాలో ముఖ్య నాయకుడిగా ఉన్న చంపాయ్ సోరెన్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి, పార్టీ చీఫ్ శిబు సోరెన్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. తన కదలికలను ట్రాక్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన "సిగ్గుమాలిన చర్య" అని చంపాయ్ సోరెన్ విమర్శించారు. తన కదలికలను స్పెషల్ బ్రాంచ్ ట్రాక్ చేస్తోందని, తనని ఫాలో చేస్తున్నారని అసలు ఊహించుకోలేదన్నారు.
గిరిజనులను కాపాడగల పార్టీ బీజేపీనే
ఈ విషయం తెలిసిన తర్వాతనే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాననిచంపాయ్ సోరెన్ చెప్పారు. జేఎంఎం తన ఉద్యమాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు. తాను జేఎంఎంలో అవమానం జరిగిందని, ఇక రాజకీయాలను వదిలివేయాలని అనుకున్నానని, కానీ తన మద్దతుదారులు రాజకీయాల్లో ఉండమని ప్రేరేపించారన్నారు. అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతేనే తాను బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యాయని చంపాయ్ సోరెన్ వెల్లడించారు. గిరిజనుల సంక్షేమం గురించి జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ఆలోచించడం లేదని, గిరిజనులకు భవిష్యత్తును కాపాడగల పార్టీ బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు.