మోదీ అధ్యక్షత బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలపై చర్చ
దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. జీ20 లీడర్స్ సమ్మిట్ తర్వాత మోదీ తొలిసారిగా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖారారు చేసే అవకాశం ఉంది. బీజేపీ సీఈసీ సమావేశం చివరిసారిగా ఆగస్టులో జరిగింది. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్‌లో 39 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పుడు మిగతా స్థానాలను అభ్యర్థులను ఎంపికే చేసే అవకాశం ఉంది.