Page Loader
Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు

Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని కోచింగ్ సెంటర్ లోకి నీరు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. రావ్ ఐఎఎస్ స్టడీ సెంటర్ వద్దకు భారీగా వరద నీరు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలోని బేస్‌మెంట్ల నుంచి విధులు నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ(MCD) కమిషనర్‌ను ఆయన ఆదేశించారు.

Details

ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు

ఈ దుర్ఘటనలో ఎవరైనా పౌర సంస్థ అధికారులు సహకరించారా అనే విషయాన్ని గుర్తించేందుకు తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. ఎవరైనా అధికారి దోషిగా తేలితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై ఇద్దరిని ఆరెస్టు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఐఎఎస్ కోచింగ్ యజమాని, కోఆర్డినేటర్ ఉన్నారు.