మరోసారి చిక్కుల్లో బ్రిజ్ భూషణ్.. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ
భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటిదాకా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులనే ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా అక్రమ మైనింగ్ కేసులో అభియోగాలు మోస్తున్నారు. ఈ మేరకు బ్రిజ్ భూషణ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించింది. గోండాలోని పలు ప్రాంతాల్లో బ్రిజ్ కంపెనీ అక్రమ ఇసుక మైనింగ్, ట్రక్కుల్లో ఓవర్ లోడ్ కారణంగా సరయూ నదికి తీవ్ర నష్టం వాటిల్లిందనే ఆరోపణలపై NGT చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, CPCB, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, UP కాలుష్య నియంత్రణ మండలితో బుధవారం సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది.